నల్గొండలో కుందూరు రఘువీర్ రెడ్డికి 5 లక్షలకు పైగా మెజార్టీ
- ఖమ్మం నుంచి 3.5 లక్షల మెజార్టీతో గెలిచిన రఘురాంరెడ్డి
- 2 లక్షలకు పైగా మెజార్టీతో కొనసాగుతున్న ఈటల రాజేందర్
- భువనగిరి నుంచి 1.85 లక్షల మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి
బీజేపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తదితరులు లక్షకు పైగా మెజార్టీతో ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ 2 లక్షలకు పైగా మెజార్టీతో సాగుతున్నారు. మెదక్ నుంచి రఘునందన్ రావు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిలు 30వేల నుంచి 70వేల మెజార్టీతో ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ స్వల్ప మెజార్టీతోనే ఉన్నారు.