రేవంత్ రెడ్డి చరిత్రలో ఉద్యమద్రోహిగానే మిగిలిపోతాడు: హరీశ్ రావు
- ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహి రేవంత్ రెడ్డి అని మండిపాటు
- ముఖ్యమంత్రిగా కావొచ్చని, కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడని వ్యాఖ్య
- సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులేనన్న హరీశ్ రావు
ఎలాంటి ఆశలు, ఆకాంక్షలు లేకుండా తెలంగాణ ఆత్మగౌరవం కోసం, దశాబ్దాల కలను సాకారం చేయడం కోసం పని చేశామన్నారు. సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులే అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరినీ సన్మానించుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా 'జై తెలంగాణ' అని లేదని తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో జై తెలంగాణ.. జైజై తెలంగాణ అని కచ్చితంగా ఉండేదని గుర్తు చేశారు.
ఆ రోజు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారని... ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పదం మాయమైందని మండిపడ్డారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల కోసం, ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.