శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది..!

Manamey Official Trailer Out Now
  • శ‌ర్వానంద్, కృతి శెట్టి జంట‌గా 'మ‌నమే' మూవీ
  • శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం
  • హేశం అబ్దుల్ వ‌హాబ్ సంగీతం 
  • పీపుల్స్ మీడియా బ్యాన‌ర్ నిర్మాణం
  • ట్రైల‌ర్‌పై హీరో రామ్‌చ‌ర‌ణ్ ట్వీట్‌
టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన మ‌నమే మూవీ ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. హీరోహీరోయిన్ల మ‌ధ్య డైలాగ్స్‌, శ‌ర్వానంద్ కామెడీ టైమింగ్‌, హేశం అబ్దుల్ వ‌హాబ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంటున్నాయి. క‌థను రివీల్ చేయ‌కుండా ట్రైల‌ర్‌ను క‌ట్ చేశారు. శర్వానంద్, కృతి శెట్టి క‌లిసి ఒక బాబుని పెంచుతున్న‌ట్లు ట్రైల‌ర్‌లో క‌నిపిస్తుంది. అయితే ఆ బాబు ఎవరు అనేది తెలియ‌కుండా ఉంది. 

ఇక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమా ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఇక‌ ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ నెల 7న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

ట్రైల‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ ట్వీట్‌
ట్రైల‌ర్ చాలా బాగుంద‌ని గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న స్నేహితుడు శ‌ర్వానంద్‌కు బెస్ట్ విషెస్ తెలియ‌జేశారు. అలాగే చిత్రం యూనిట్‌కి గుడ్‌ల‌క్ కూడా చెప్పారు. ఈ నెల 7న విడుద‌ల కానున్న ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు చెర్రీ ట్వీట్ చేశారు.

Advertisement
Manamey Official Trailer
Sharwanand
Krithi Shetty
Tollywood

More Telugu News