పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది.. జూన్, జులైలలో సుముహూర్తాలు
- ఈ నెలాఖరులో మొదలువుతున్న శుభ ఘడియలు
- వచ్చే నెల ప్రారంభంలో మంచి రోజులు
- మూఢం, శూన్య మాసం కారణంగా నిలిచిన వివాహాలు
పండితులు చెప్పిన వివరాల ప్రకారం ఈ నెలాఖరు నుంచి శుభ ఘడియలు మొదలు కానున్నాయి. మాఘ, ఉత్తర ఫాల్గుణి, హస్తా, స్వాతి నక్షత్రాల వేళ శుభ ముహుర్తాలు ఉన్నాయని, వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలని పండితులు చెప్పారు. ఈ ముహూర్తాలు దాటితే చాతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మంచి ముహూర్తాలు లేవని వివరించారు. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ నెలలోనే శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయని పేర్కొన్నారు.
శుభ ముహూర్తాలు ఇవే..
జూన్ 29 శనివారం, జులై 9 మంగళవారం, జులై 11 గురువారం, జులై 12 శుక్రవారం, జులై 13 శనివారం, జులై 14 ఆదివారం, జులై 15 సోమవారం