తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు... ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు

IMD predicts rains in Telangana for three days
  • శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
  • శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
  • గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. దీంతో శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. 

నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Go Back to Shorts
Telangana
Rains
IMD

More Telugu News