మరగబెడుతుండగా విరిగిన పాలు.. పైపుతో భార్యను చితకబాదిన భర్త
- హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఘటన
- వివాహమైన దగ్గరి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు
- పాలు విరిగిన సాకుతో తల్లి, సోదరితో కలిసి భార్యపై భర్త దాడి
పెళ్లి సమయంలో కట్నం తీసుకున్నప్పటికీ అదనపు కట్నం కావాలంటూ హీనాబేగంను భర్త, అత్త అఫ్రోజ్ బేగం, ఆడపడుచు సోని, మరిదిలు తబ్రేజ్, అయూబ్ నిత్యం శారీరకంగా, మానసికంగా వేధించసాగారు. ఈ క్రమంలో తాజాగా హీనాబేగం పాలు మరగబెడుతున్న సమయంలో అవి విరిగిపోయాయి. దీనిని సాకుగా తీసుకుని అందరూ కలిసి అకారణంగా పాలు విరగ్గొట్టావని మండిపడుతూ పైపుతో ఆమెపై దాడిచేశారు. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది.
ఆ వెంటనే అత్తమామలకు ఫోన్ చేసిన హుస్సేన్.. హీనా చనిపోయిందని, వెంటనే రావాలని చెప్పాడు. వారొచ్చి తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.