రుద్రమ్-2 యాంటీ రేడియేషన్ మిసైల్ పరీక్ష విజయవంతం
- సు-30 ఎమ్కే-1 యుద్ధ విమానం నుంచి మిసైల్ ప్రయోగం
- ప్రమాణాలకు అనుగుణంగా క్షిపణి చోదక, నియంత్రణ, మార్గదర్శక వ్యవస్థలు
- రుద్రమ్తో శత్రుదేశ రాడార్, కమ్యూనికేషన్, గగనతల రక్షణ వ్యవస్థల నిర్వీర్యం
మూడేళ్ల క్రితం డీఆర్డీఓ.. తొలి తరం రుద్రమ్ మిసైల్‌ను పరీక్షించింది. రేడియేషన్ వెలువరించే వ్యవస్థలను ఈ మిసైల్ గుర్తించి, నిర్వీర్యం చేస్తుందని డీఆర్డీఓ పేర్కొంది.
రుద్రమ్ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇదో అద్భుత విజయమని వ్యాఖ్యానించారు.