ఆలయ నిర్మాణానికి మసీదు స్థలం విరాళంగా ఇచ్చిన ముస్లింలు!
- తమిళనాడు తిరుప్పూరు జిల్లాలోని రోస్ గార్డెన్ ప్రాంతంలో ఘటన
- స్థానికంగా మసీదు మాత్రమే ఉన్న వైనం
- స్థలం లేక ఆలయ నిర్మాణం చేపట్టని హిందువులు
- మసీదు స్థలాన్ని విరాళంగా ఇచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించిన ముస్లింలు
ఇక్కడ మసీదు ఉన్నప్పటికీ హిందువులకు ఆలయం లేదు. గుడి కట్టాలనుకున్నా స్థలం లేకపోవడంతో ఆ వర్గం వారు మౌనంగానే ఉండిపోయారు. ఇది తెలిసిన ఆ ప్రాంత ముస్లింలు స్థానిక మసీదుకు చెందిన 3 సెంట్ల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి దానంగా ఇచ్చారు. ప్రస్తుతం గుడి పనులు పూర్తయి సోమవారం కుంభాభిషేకం జరిగింది. సారెతో కార్యక్రమానికి వచ్చిన ముస్లింలకు హిందువులు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు.