రేవ్ పార్టీ అంటే ఏంటో వివరించిన సినీ నటుడు నవదీప్
ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీకి తాను హాజరు అయినట్టు ఫేక్ వార్తలు రాక కొందరు నిరుత్సాహపడి ఉంటారని సినీ నటుడు నవదీప్ అన్నారు. ‘ ఏంటన్నా.. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్ లో కనిపించడంలేదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు.
నవదీప్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘లవ్ మౌళి’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో రేవ్ పార్టీ గురించి ప్రశ్న ఎదురైంది. ‘ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు’ అని విలేకరి ప్రస్తావించగా.. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ వ్యాఖ్యానించారు. రేవ్ పార్టీ అంటే రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు.