బెంగళూరు రేవ్ పార్టీ కేసు: టాలీవుడ్ నటి రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు
- ఇటీవల బెంగళూరులో రేవ్ పార్టీ
- పట్టుబడిన వారిలో నటి హేమ
- పట్టుబడిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించిన పోలీసులు
- 103 మందికి డ్రగ్స్ పాజిటివ్
బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్టు పోలీసులు ఇటీవల ఓ ఫొటో కూడా విడుదల చేశారు. అంతకుముందు, ఆమె తాను బెంగళూరులో లేనని, హైదరాబాదులోని ఓ ఫాంహౌస్ లో చిల్ అవుతున్నానని వీడియో విడుదల చేసింది. అయితే, ఆ వీడియోలో హేమ ధరించిన డ్రెస్సుతోనే ఉన్న ఫొటోను పోలీసులు విడుదల చేయడంతో ఆమె బుకాయిస్తోందన్న విషయం బట్టబయలైంది.