కోహ్లీ వికెట్ తీసి సంచలన రికార్డు నెలకొల్పిన చాహల్
- రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన స్పిన్నర్
- చారిత్రాత్మక మైలురాయిని సొంతం చేసుకున్న యజువేంద్ర చాహల్
- ఆర్సీబీ తరపున కూడా అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్
రాజస్థాన్ తరపున ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
1. యజువేంద్ర చాహల్ - 66 వికెట్లు (45 మ్యాచ్‌ల్లో)
2. సిద్ధార్థ్ త్రివేది - 65 వికెట్లు (75 మ్యాచ్‌ల్లో)
3. షేన్ వాట్సన్ - 61 వికెట్లు (70 మ్యాచ్‌ల్లో)
4. షేన్ వార్న్ - 57 వికెట్లు (54 మ్యాచ్‌ల్లో)
5. జేమ్స్ ఫాల్క్‌నర్ - 47 వికెట్లు (42 మ్యాచ్‌ల్లో)
ఇక గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 112 మ్యాచ్‌లు ఆడిన చాహల్ ఏకంగా 139 వికెట్లతో ఆ జట్టు తరపున కూడా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. కాగా గత రాత్రి ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో చాహల్ రాణించాడు. బెంగళూరు జట్టుని 172 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతడు తీసింది ఒక్క వికెటే అయినప్పటికీ తన అనుభవంతో పరుగులను నియంత్రించాడు. భీకరమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీని అద్భుతమైన బంతితో ఔట్ చేసి జట్టు విజయంలో తనవంతు సహకారం అందించాడు.