మాదాపూర్ లో జనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి
- పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వైపు వెళుతున్న కారు
- మాదాపూర్ స్టేజీ వద్ద అదుపుతప్పిన వైనం
- పాల వ్యాపారికి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఒక్కసారిగా కారు మీదికి దూసుకురావడంతో ఏం జరిగిందనేది అర్థం కాలేదని, తేరుకునే సరికే ఓ వ్యక్తి చనిపోయాడని చెప్పారు. రోడ్డు పక్కనే పాలవ్యాపారం చేసుకునే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించి, అంబులెన్స్ కు ఫోన్ చేసినట్లు అక్కడున్న వారు తెలిపారు. కాగా, నేటి ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.