భారీ వర్షంతో నిలిచిపోయిన క్రికెట్ మ్యాచ్... ఉప్పల్ స్టేడియంలో లైట్స్ అండ్ మ్యూజిక్ షో... వీడియో ఇదిగో!

Lights and music show at uppal stadium
  • హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌ కోసం నిండిపోయిన ఉప్పల్ స్టేడియం
  • భారీ వర్షంతో మ్యాచ్ ఆగిపోవడంతో లైట్స్ అండ్ మ్యూజిక్ షో
  • నాటు నాటు సాంగ్‌కు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టిన అభిమానులు
హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం ఇలాగే కురిస్తే మ్యాచ్ రద్దయ్యే అవకాశముంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. దాదాపు స్టేడియం ఫుల్ అయింది. మ్యాచ్ నిలిచిపోవడంతో అభిమానులు గంటలకొద్దీ స్టేడియంలో ఉండవలసి వచ్చింది.

ఈ సమయంలో వారికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఉప్పల్ స్టేడియంలో కాసేపు లైట్స్ అండ్ మ్యూజిక్ షో ప్రదర్శించారు. ఇది క్రికెట్ అభిమానులను అలరించింది. 'నాటు నాటు' సాంగ్‌కు అనుగుణంగా వేసిన లైటింగ్‌కు అందరూ ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు.
Advertisement
Cricket
Hyderabad
Rains
RRR
Sunrisers Hyderabad

More Telugu News