బైక్ పై ఎలుగుబంటి షికారు.. వీడియో వైరల్!

bear rides bike waves onlookers in russia
  • రష్యాలో వెలుగులోకి విచిత్ర ఘటన
  • సర్కస్ కంపెనీలో పనిచేస్తున్న టిమ్ అనే ఎలుగుబంటి
  • బైక్ పక్కన ఏర్పాటు చేసిన సైడ్ కార్ లో కూర్చోబెట్టి సరదాగా బయటకు తిప్పుతున్న నిర్వాహకులు
రష్యాలోని ఆర్కెంగెలిస్క్ ప్రాంత వీధుల్లో ఓ ఎలుగుబంటి సరదాగా బైక్ పై షికారుకెళ్లింది! రోడ్డుపై కనిపించిన వారికి సరదాగా హాయ్ చెబుతూ ముందటి కాలును పైకెత్తింది! ఇందుకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించాడు. అయితే ఇది పాత వీడియోనే అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ అయింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. యూపీఐ న్యూస్ కథనం ప్రకారం.. ఆ వీడియోలోని ఎలుగుబంటి పేరు టిమ్. ఓ సర్కస్ కంపెనీలో పనిచేస్తోంది! అలసటకు గురైనప్పుడల్లా ఎలుగుబంటి ట్రైనర్ దాన్ని బైక్ కు అతికించిన సైడ్ కార్ లో కూర్చోబెట్టుకొని ఇలా వీధుల్లో తిప్పుతాడట.

అయితే ఇందులో భయపడాల్సిందేమీ లేదని సర్కస్ నిర్వాహకుడు ఒకరు తెలిపారు. స్థానికుల భద్రతపై అధికారులతో సమన్వయం చేసుకున్నాకే టిమ్ ను అప్పుడప్పుడూ అలా బయట తిప్పుతుంటామని వివరించారు.

తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే దీనికి ఏకంగా ఒక కోటీ 10 లక్షల వ్యూస్ లభించాయి. ఎలుగుబంటి బైక్ షికారును చూసిన నెటిజన్లు బోలెడు సరదా కామెంట్లు చేశారు.
Go Back to Shorts
Russia
bear
bike ride
waves
onlookers
viral video

More Telugu News