navneet kaur rana: దేశమంతా రామభక్తులే.. ఒవైసీ బ్రదర్స్ కు ఎంపీ నవనీత్ కౌర్ మాస్ వార్నింగ్

Ram Bhakts Everywhere BJP Leader Fresh Dare To Owaisi

  • ‘ఎక్స్’లో వీడియోను విడుదల చేసిన బీజేపీ ఫైర్ బ్రాండ్
  • ఒవైసీ చెప్పే ఫిరంగులు అందరి ఇళ్ల ముందు డెకరేషన్ వస్తువుగా ఉంటాయని కౌంటర్
  • షాద్ నగర్ ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదైనా వెనక్కి తగ్గని వైనం

మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా తగ్గేదే లే అంటున్నారు! తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బ్రదర్స్ కు వరుసగా సవాళ్లు విసురుతున్నారు. షాద్ నగర్ లో ప్రచారం సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఈసీ ఎఫ్ ఐఆర్ నమోదుకు ఆదేశించినా ఆమె పట్టించుకోవట్లేదు. తాజాగా ఆమె సోషల్ ‘ఎక్స్’లో తన సవాళ్ల వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఒవైసీ సోదరులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఫిరంగి లాంటి తన సోదరుడు అక్బరుద్దీన్ ను అదుపులో ఉంచుతున్నానంటూ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఒవైసీ తన ప్రసంగంలో సోదరుడిని ఫిరంగిగా అభివర్ణించారు. కానీ అలాంటి ఫిరంగులు ప్రతి ఇంటి బయట డెకరేషన్ కోసం ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని వీధివీధిలో రామభక్తులు, మోదీజికి చెందిన సింహాలు సంచరిస్తున్నాయి. నేను హైదరాబాద్ వస్తున్నా. దమ్ముంటే నన్ను ఆపు’ అంటూ నవనీత్ కౌర్ ఆ వీడియోలో సవాల్ విసిరారు.

ఇప్పటికే ఆమె ఒవైసీ సోదరులకు 15 సెకన్ల సవాల్ విసిరారు. పోలీసులు కేవలం 15 సెకన్లు డ్యూటీ నుంచి పక్కకు తప్పుకుంటే ఒవైసీ సోదరులు ఎక్కడి నుంచి వచ్చారో.. తిరిగి ఎక్కడికి చేరుకున్నారో కూడా తెలియకుండా చేస్తామని హెచ్చరించారు.

navneet kaur rana
bjp mp
Asaduddin Owaisi
warning
election campaign
  • Loading...

More Telugu News