రాష్ట్రంలో గతేడాదికంటే రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గాయి: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ
- రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించడం వల్లేనన్న అసోం సీఎం
- వీటికి తోడు నిబంధనలు కఠినంగా అమలు చేశామన్న హిమంత బిశ్వశర్మ
- జనవరి-ఏప్రిల్ మధ్య కాలాన్ని గతేడాది తో పోల్చితే 22 శాతం మరణాలు తగ్గాయని పోస్ట్ చేసిన సీఎం
2023 జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 22 శాతం రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయని అందులో పేర్కొన్నారు. 2022 డిసెంబర్, 2023 డిసెంబర్ తో పోలిస్తే కనీసం 30.69 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. ఇక గతేడాది జనవరి ఈ ఏడాది జనవరితో పోలిస్తే 24.6 శాతం రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిందని అందులో పేర్కొన్నారు.