అనుకూలించని వాతావరణం.. కేకేఆర్ ఆటగాళ్ల విమానం రెండుసార్లు మళ్లింపు.. అయినా చేరని గమ్యస్థానం
- గత రాత్రి లక్నో నుంచి కోల్కతా బయలుదేరిన కేకేఆర్ ఆటగాళ్లు
- ప్రతికూల వాతావరణం కారణంగా తొలుత గువాహటికి మళ్లింపు
- ఆ తర్వాత క్లియరెన్స్ లభించినా రెండోసారి అదే కారణంతో వారణాసికి
- నేటి మధ్యాహ్నం కోల్కతాకు ఆటగాళ్లు
కోల్కతాలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని గువాహటికి మళ్లించారని, తాము ఇప్పుడే ఇక్కడ ల్యాండ్ అయ్యామంటూ కేకేఆర్ ఫ్రాంచైజీ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఆ తర్వాత కాసేపటికే క్లియరెన్స్ లభించడంతో ఆటగాళ్లు తిరిగి కోల్కతా బయలుదేరారు. అయితే, ఆ తర్వాత తెల్లవారుజామున 1.20 గంటలకు మరోమారు ఎక్స్ చేస్తూ కోల్కతా వెళ్లాలన్న రెండో ప్రయత్నం కూడా ప్రతికూల వాతావరణం వల్ల విఫలమైందని, విమానాన్ని వారణాసి మళ్లించారని తెలిపింది.
చివరికి తెల్లవారుజామున 3 గంటలకు మరో అప్డేట్ ఇస్తూ.. ప్రస్తుతం తాము ఈ రాత్రి వారణాసి హోటల్లో ఉండబోతున్నట్టు తెలిపింది. మంగళవారం (నేడు) మధ్యాహ్నం కోల్కతా చేరుకుంటామని పేర్కొంది.