రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త... రైతు భరోసా నిధుల విడుదల

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా (రైతుబంధు) నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు ఎకరాల లోపు వారికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పుడు ఐదు ఎకరాలు పైబడిన రైతులకు కూడా నిధులు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. రైతు భరోసా కింద ప్రభుత్వం రూ.2000 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. తాము అధికారంలోకి రాగానే రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.
Go Back to Shorts
Rythu Bharosa
Telangana

More Telugu News