హైదరాబాద్ లోని పబ్ లో అసభ్య నృత్యాలు.. నిర్వాహకులపై కేసు
- 167 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
- ఇతర రాష్ట్రాల నుంచి యువతులను పిలిపించి డ్యాన్స్
ఈ క్రమంలోనే పోలీసులు, ఉన్నతాధికారులు తరచుగా పబ్ లపై దాడులు చేస్తూ నిర్వాహకులపై కేసులు పెడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లోని ఆఫ్టర్ నైన్ క్లబ్ లో శనివారం రాత్రి పోలీసులు రెయిడ్ చేశారు. పబ్ లో యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తుండడంతో నిర్వాహకులతో పాటు పబ్ కు వచ్చిన వారిని కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. 35 మంది యువతులతో పాటు మొత్తం 167 మందిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.