ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని.. హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి?: చంద్రబాబు
- సీఎం జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత
- ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ధ్వజం
- అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ ఫైర్
ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకుని, హక్కుదారు చేతికి వాటి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటి? అని మండిపడ్డారు. అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి? అంటూ దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉండటం చాలా ప్రమాదకరమని చెప్పారు. ప్రజలు ఇది గ్రహించాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.