Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ తో 'కూలి' నిర్మిస్తున్న స‌న్ పిక్చ‌ర్స్‌కు ఇళ‌య‌రాజా నోటీసు!

Ilaiyaraaja Notices to Sun Pictures
Advertisement
  • ర‌జనీకాంత్, ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ కాంబోలో  కూలి మూవీ
  • ఇటీవ‌ల విడుద‌లైన మూవీ టైటిల్ టీజ‌ర్‌
  • ఈ టైటిల్ టీజ‌ర్‌లో అనుమ‌తి లేకుండా త‌న సంగీతాన్ని వాడిన‌ట్టు ఇళ‌య‌రాజా నోటీసు
  • కూలి చిత్రాన్ని నిర్మిస్తున్న స‌న్ పిక్చ‌ర్స్‌
Advertisement
 ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్‌కు సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా నోటీసు పంపించారు. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ కాంబోలో వ‌స్తున్న 'కూలి' మూవీ టైటిల్ టీజ‌ర్‌లో అనుమ‌తి లేకుండా త‌న సంగీతాన్ని వాడిన‌ట్టు ఇళ‌య‌రాజా నోటీసులో పేర్కొన్నారు. ర‌జనీ న‌టిస్తున్న ఈ 171వ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. తాజాగా లోకేశ్ ఈ మూవీ టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశాడు. ఇందులో ర‌జ‌నీకాంత్ న‌టించిన 'తంగ‌మ‌గ‌న్' మూవీలోని 'వా వా ప‌క్కం వా' పాటలోని మ్యూజిక్‌ను ఉప‌యోగించారు. 

త‌న అనుమ‌తి లేకుండా ఉప‌యోగించిన ఆ పాట సంగీతాన్ని వెంట‌నే తొల‌గించాల‌ని, లేనిప‌క్షంలో ఆ పాట‌కు త‌గిన అనుమ‌తి పొందాల‌ని స‌న్ పిక్చ‌ర్స్‌కు ఇళ‌య‌రాజా నోటీసు పంపించ‌డం జ‌రిగింది. అలా చేయ‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. ఇక త‌న సంగీతంలోని పాట‌ల‌ను త‌న అనుమ‌తిలేకుండా స్టేజ్ షోల‌లో ఆల‌పించ‌కూడ‌ద‌ని, సినిమాల్లోనూ ఉప‌యోగించ‌రాద‌ని గ‌తంలో ఇళ‌య‌రాజా ఆంక్ష‌లు విధించారు. దానిని అతిక్ర‌మించిన వారిపై ఆయ‌న కేసులూ పెడుతుండ‌టం ఇప్పుడు గ‌మ‌నించ‌ద‌గిన విష‌యం.
Advertisement
Advertisement
Ilaiyaraaja
Sun Pictures
Rajinikanth
Coolie Movie
Kollywood

More Telugu News