మోదీ ప్రభుత్వం ఎంతో ధైర్యంతో ఆర్టికల్ 370ని రద్దు చేసింది: జేపీ నడ్డా

JP Nadda Public Meeting in Khammam
  • వందల ఏళ్ల నాటి రామమందిర నిర్మాణాన్ని సాకారం చేసిందన్న నడ్డా
  • దేశ అభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీయేనని వ్యాఖ్య
  • మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న జేపీ నడ్డా
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ధైర్యంతో ఆర్టికల్ 370ని రద్దు చేసిందని, శతాబ్దాల కల అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సాకారం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... దేశ అభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. విపరీతమైన ఎండలోనూ సభకు జనం తరలి వచ్చారన్నారు. మహబూబాబాద్, ఖమ్మం లోక్ సభ నియోజకవర్గాల నుంచి సీతారాం నాయక్, వినోద్ రావులను గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలహీనమైనదని విమర్శించారు. యూపీఏ హయాంలో ఎక్కడ చూసినా అవినీతి, కుంభకోణాలే ఉండేవని ఆరోపించారు. గిరిజనుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో 11వ స్థానంలో మన దేశాన్ని మోదీ 5వ స్థానానికి తీసుకువచ్చారన్నారు.
Go Back to Shorts
JP Nadda
BJP
Telangana
Lok Sabha Polls

More Telugu News