మెదడును చురుగ్గా ఉంచాలంటే..?
- మెమరీ పవర్ ను పెంచే బ్రెయిన్ గేమ్స్
- క్రాస్ వర్డ్ పజిల్స్ తోనూ మెదడుకు మేత
- వ్యాయామం, కుట్లు అల్లికలతో పెరగనున్న ఏకాగ్రత
మొబైల్ ఫోన్ పట్టుకుని సోషల్ మీడియాలో మునిగితేలడం కాకుండా ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న బ్రెయిన్ గేమ్స్ ఆడడం వల్ల మెమరీని మెరుగుపర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జిగ్ సా పజిల్స్ పూర్తిచేయడం కూడా మెదడుకు మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుందన్నారు. కుట్లు, అల్లికలకు ఎంతో ఏకాగ్రత అవసరమని, దీనివల్ల మెదడు చురుగ్గా ఉంటుందని వివరించారు. డ్యాన్స్ అంటే ఇష్టపడే వారు ఎంచక్కా మంచి మ్యూజిక్ పెట్టుకుని సరదాగా స్టెప్పులేస్తూ మెమరీ పవర్ ను పెంచుకోవచ్చని చెప్పారు. ఇక, శరీర దృఢత్వానికి తోడ్పడే కసరత్తులు మెదడునూ ఉత్తేజితం చేస్తాయని, నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఇటు శరీరాన్ని, అటు మెదడునూ ఫిట్ గా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.