వయనాడ్‌లో ఓడిపోతున్నారు... రాహుల్ గాంధీ 4 లేదా 5 సీట్లలో పోటీ చేస్తే ఏదో ఒకచోట గెలవచ్చు: పీయూష్ గోయల్
- రాహుల్ గాంధీకి దమ్ముంటే తనపై పోటీ చేయాలని పీయూష్ గోయల్ సవాల్
- అమేథి నుంచి ఈసారి ప్రజలకు ముఖం చూపించలేనంత దారుణంగా ఓడిపోతారని జోస్యం
- నాలుగైదు చోట్ల పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుంటే బాగుంటుందని ఎద్దేవా
అందుకే ముంబై నార్త్ నుంచి కూడా తనపై పోటీ చేయాలని రాహుల్ గాంధీకి సూచిస్తున్నానని ఎద్దేవా చేశారు. వారణాసి నుంచి కూడా రాహుల్ గాంధీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఆయన నాలుగైదు సీట్లలో పోటీ చేస్తే... అప్పుడు కానీ అనుకోకుండా ఏదో ఒక సీటులో గెలిచే అవకాశముంటుందని చురక అంటించారు. బీజేపీ పాలనలో ప్రతి పైసాకు లెక్క ఉంటుందని... దేశ హితం కోసం వినియోగిస్తామని పీయూష్ గోయల్ అన్నారు. అవినీతి లేకుండా, బినామీలు లేకుండా నేరుగా లబ్ధిదారులకు నిధులను బదిలీ చేస్తున్నామన్నారు.