ఎక్కడ మందు దొరికినా నాకే లింక్ పెడతారా?: ఏపీ మంత్రి కాకాణి ఫైర్
- సోమిరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న కాకాణి
- ఓటర్లకు సోమిరెడ్డి డబ్బులు పంచుతున్నారని విమర్శ
- సంస్కారంగా మాట్లాడటాన్ని సోమిరెడ్డి అలవాటు చేసుకోవాలని సూచన
పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5 వేల మంది జనాలు వచ్చినట్టు నిరూపిస్తే తన నామినేషన్ ఉపసంహరించుకుంటానని చెప్పారు. సోమిరెడ్డి బతుకంతా అవినీతిమయమని అన్నారు. ఓటర్లకు సోమిరెడ్డి డబ్బులు పంచుతున్నారని... ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. సంస్కారంగా మాట్లాడటాన్ని సోమిరెడ్డి అలవాటు చేసుకోవాలని చెప్పారు. తాను ఏం మాట్లాడాలో కూడా సోమిరెడ్డే చెపుతున్నారని విమర్శించారు.