Rathnam: విశాల్ ‘రత్నం’ సెన్సార్ పూర్తి... రేపే గ్రాండ్‌గా విడుదల

Vishal starring Rathnam movie set to release tomorrow
షార్ట్స్‌లో చూడండి
యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టేందుకు 'రత్నం' మూవీ రాబోతోంది. ఇది వరకే ఈ ఇద్దరి కలయికలో వచ్చిన భరణి, పూజా వంటి యాక్షన్ మూవీస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడోసారి 'రత్నం'తో ఈ కాంబో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 

జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. రత్నం మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. 

'రత్నం' సినిమా తెలుగు, తమిళ్ లో రేపు (ఏప్రిల్ 26) గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.  ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. 

రీసెంట్‌గా రిలీజ్ చేసిన "ఎటువైపో ఎటువైపో..." అనే పాట శ్రోతలను మెప్పించింది. దేవీ శ్రీ ప్రసాద్-విశాల్ కాంబోలో వస్తున్న మొదటి సినిమా 'రత్నం'. దాంతో మ్యూజిక్ లవర్స్ దృష్టి ఈ  యాక్షన్ ఓరియెంటెడ్ మూవీపై మీద పడింది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు సినిమాను వీక్షించి U/A సర్టిఫికెట్‌ను అందించారు.
Go Back to Shorts
Rathnam
Vishal
Release
Hari
Kollywood
Tollywood

More Telugu News