రూ.20 కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్
- ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చిన ఐఆర్ సీటీసీ
- జనరల్ బోగీ నిలిచే చోట ఏర్పాటు చేసిన అధికారులు
- వేసవి పూర్తయ్యే వరకూ స్పెషల్ కౌంటర్ ఉంటుందని వెల్లడి
జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేసవి పూర్తయ్యే వరకూ ఈ స్పెషల్ కౌంటర్ ఉంటుందని వివరించారు. ప్రస్తుతానికి ఈ కౌంటర్లను ప్రయోగాత్మకంగా విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ వివరించారు.