తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో
- అత్యధిక స్థాయి ముప్పు నుంచి కూడా రక్షణ
- విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీవో
- భద్రతా బలగాల కోసం అభివృద్ధి
కాన్పూర్‌లోని డీఆర్‌డీవో విభాగం డీఎంఎస్ఆర్‌డీఈ (డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్) దీనిని తయారు చేసిందని తెలిపింది. మందుగుండు సామగ్రి నుంచి కూడా రక్షణ ఇవ్వగలదని, దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇదేనని పేర్కొంది. ఇటీవలే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ విజయవంతంగా పరీక్షించినట్టు తెలిపింది. చండీగఢ్‌లో పరీక్ష నిర్వహించినట్టు వివరించింది.