Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబై విమానాశ్ర‌యంలో కెమెరా కంటికి చిక్కిన‌ తార‌క్‌.. కొత్త లుక్‌లో అదుర్స్!

Jr NTR New Look Captured in Mumbai Airport
Advertisement
  • బాలీవుడ్ మూవీ 'వార్ 2' షూటింగ్ కోసం ముంబైలో ఎన్‌టీఆర్‌
  • ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన యంగ్ టైగ‌ర్
  • ఈ క్ర‌మంలో ఆయ‌న‌ ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన స‌మ‌యంలో తీసిన ఫొటోలు, వీడియో వైర‌ల్‌
Advertisement
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' మూవీ త‌ర్వాత‌ ప్రేక్షకుల ముందుకు రాలేదు. 2023లో తారక్ సినిమాలేవీ కూడా రిలీజ్ కాలేదు. ఇక ఈ ఏడాది 'దేవ‌ర'తో అభిమానుల‌ను అల‌రించ‌బోతున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి పార్ట్ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వ‌స్తున్న మూవీ కావ‌డంతో దేవ‌ర‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా గ్లింప్స్ విడుద‌ల కాగా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 

ఇక‌ దేవ‌ర సినిమా త‌ర్వాత ఆయ‌న బాలీవుడ్ మూవీ 'వార్ 2'లో న‌టించ‌నున్నాడు. ఈ చిత్రంతోనే తార‌క్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు కూడా. ఇందులో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా న‌టిస్తున్నాడు. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి డైరెక్ట‌ర్‌. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. దాంతో ఇటీవ‌లే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం తార‌క్‌ ముంబైలోనే ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ ముంబై విమానాశ్ర‌యంలో దిగిన స‌మ‌యంలో తీసిన ఫొటోలు, వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌స్తుతం నెట్టింట‌ వైర‌ల్ అవుతున్నాయి. కొత్త లుక్‌లో తార‌క్‌ అదుర్స్ అనిపిస్తున్నాడు
Advertisement
Advertisement
Jr NTR
War 2 Movie
Devara Movie
Tollywood
Bollywood

More Telugu News