ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి... హైటెన్షన్ వైర్‌లాంటి వాడిని: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్
- మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరిక
- కారు షెడ్డుకు పోయింది... ఇక అది బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా
- బీఆర్ఎస్ పదేళ్లలో పాలమూరుకు చేసిందేమీ లేదని విమర్శ
కాంగ్రెస్ హయాంలో పాలమూరు కోసం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామని, కానీ బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో ఈ జిల్లాను ఏడారిగా మార్చారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకు వచ్చారా? అని బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. పార్లమెంట్‌లో నిద్రపోవడానికే బీఆర్ఎస్‌కు ఓటేయాలని చురక అంటించారు. లోక్ సభ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పాలమూరును కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇక్కడి నుంచి కేసీఆర్ గెలిచారు కానీ చేసింది మాత్రం సున్నా అని విమర్శించారు. గతంలో పాలమూరుకు మంత్రి పదవులు కూడా దక్కలేదన్నారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు.