జీమ్లో హీరోయిన్ వర్కౌట్.. నెట్టింట ఫన్నీ వీడియో వైరల్!
- ఇన్స్టాలో ఫన్నీ వీడియో షేర్ చేసిన 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్
- జీమ్ ట్రైనర్తో కామెడీ చేసిన బాలీవుడ్ భామ
- వీడియో చూసి తమదైన శైలిలో స్పందిస్తున్న నెటిజన్లు
దానికోసం మృణాల్ ఠాకూర్ క్రమం తప్పకుండా జీమ్కి వెళ్తుంది. అప్పుడప్పుడు జీమ్లోని వర్కౌట్ల తాలూకు ఫొటోలు, వీడియోలను ఆమె అభిమానులతో పంచుకుంటుంది కూడా. ఇదే కోవలో తాజాగా మృణాల్ జిమ్ వర్కౌట్ వీడియో ఒకటి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె ట్రైనర్తో కామెడీ చేయడం మనం చూడొచ్చు.
ఈ వీడియోలో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభిస్తుంది. ట్రైనర్ చూడని సమయంలో వర్కౌట్స్ ఆపేసి డ్యాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కౌట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. ఇప్పుడీ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.