అదే కష్టం .. అయినా కనిపించని హిట్!

Young Heros Movies Update
  • వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్
  • 'కార్తికేయ 2' తరువాత తగ్గిన నిఖిల్ స్పీడ్ 
  • నాగశౌర్య నెక్స్ట్ మూవీస్ పై లేని అప్ డేట్స్ 
  • ఆల్రెడీ అఖిల్ .. శర్వానంద్ .. కార్తికేయ సినిమాలకు గ్యాప్   

ఎలాంటి కథలను ఎంచుకోవాలో తెలియని ఒక అయోమయ పరిస్థితి ఇప్పుడు హీరోలను వెంటాడుతోంది. ప్రయోగాలు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది .. అలా అని చేసిన ప్రయోగాలు సరైన ఫలితాలను ఇవ్వడం లేదు. ఇదివరకటిలా రీమేక్ లు చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడ హిట్ కొట్టిన సినిమాలు నేరుగా తెలుగు థియేటర్స్ లో వచ్చి పడుతున్నాయి. ఇక్కడ కూడా శభాష్ అనిపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యంగ్ హీరోలు వైవిధ్యభరితమైన కథల కోసం .. పాత్రల కోసం నానా తిప్పలు పడుతున్నారు. నితిన్ విషయానికి వస్తే, 'భీష్మ' తరువాత ఇంతవరకూ హిట్ పడలేదు. వరుసగా ఐదు ఫ్లాపులను ఎదుర్కున్న నితిన్, ఇప్పుడు 'తమ్ముడు' .. 'రాబిన్ హుడ్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. నిఖిల్ విషయానికొస్తే, '18 పేజెస్' .. 'స్పై' సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు ఆయన దృష్టి అంతా కూడా 'స్వయంభూ 'పైనే ఉంది. ఇక నాగశౌర్య కూడా హిట్ అనే మాట విని చాలా కాలమైంది. 'రంగబలి' తరువాత నాగశౌర్య స్పీడ్ తగ్గిందనే చెప్పాలి. రెండు మూడు ప్రాజెక్టులు చేతిలో ఉన్నా వాటి అప్ డేట్స్ మాత్రం తెలియడం లేదు. ఆ సినిమాలు ఎప్పుడు ప్రమోషన్స్ వరకూ వస్తాయో తెలియదు. ఇక శర్వానంద్ .. అఖిల్ .. కార్తికేయ వంటి హీరోల పరిస్థితి కూడా అంతే ఉంది. ఏ సినిమాకైనా పడే కష్టం ఒకటే అయినా, ఆ కష్టాన్ని మరిపించే హిట్ మాత్రం వీరితో దోబూచులాడుతూనే ఉంది. 

Advertisement
Nithin
Nikhil
Nagashourya
Akhil
Sharwanand

More Telugu News