ఈసారి నైరుతి రుతుపవనాలతో వర్షాలే వర్షాలు... ఐఎండీ అంచనా
- భారత్ లో అత్యధిక శాతం వర్షాన్ని అందించేవి నైరుతి రుతుపవనాలు
- ఈసారి 106 శాతం వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ
- ఈసారి భారత్ కు లా నినా పరిస్థితులు కలిసి వస్తాయని వెల్లడి
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరానికి చేరుకుంటాయి. సెప్టెంబరు మాసం రెండో వారం నుంచి తిరోగమనం ప్రారంభిస్తాయి. దాదాపు నాలుగు నెలల పాటు దేశంలో అత్యధిక ప్రాంతాల్లో వర్షపాతాన్ని ఇస్తాయి.
కాగా, 96 శాతం నుంచి 104 శాతం మధ్యన ఉంటే దాన్ని సగటు లేదా సాధారణ వర్షపాతంగా పిలుస్తారని, అంతకుమించితే దాన్ని సాధారణం కంటే అత్యధికం అంటారని ఐఎండీ స్పష్టత ఇచ్చింది. గత కొంతకాలంగా ఎల్ నినో పరిస్థితులతో క్షామ పరిస్థితులను చవిచూసిన భారత్ కు ఈసారి లా నినా పరిస్థితులు కలిసి వస్తాయని ఐఎండీ చెబుతోంది. లా నినాతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.