దానంను మేం కబ్జా చేయనివ్వలేదు.. కాంగ్రెస్ లో చేరి దర్జాగా కాజేశాడు: కేటీఆర్
- దానం నాగేందర్ భూకబ్జాపై మండిపడ్డ మాజీ మంత్రి
- రూ.20 కోట్ల విలువైన భూమిని కాజేశాడని ఫైర్
- పార్టీ మారడానికి అది రేవంత్ ఇచ్చిన నజరానా అంటూ వ్యాఖ్య
దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ లో చేరడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆ భూమిని దానం నాగేందర్ కు నజరానాగా ఇచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. అలాంటి వ్యక్తి మాట్లాడిన మాటలను, చేసిన ఆరోపణలను కూడా మీడియా హైలెట్ చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఆయనేదో సత్య హరిశ్చంద్రుడు అన్నట్లుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారాలని అనుకునే వారు ఏదో ఒక కారణం వెతుక్కుంటారని కేటీఆర్ చెప్పారు.