పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మంచు మౌనిక
- ఇన్ స్టా వేదికగా వెల్లడించిన లక్ష్మీ మంచు
- మనోజ్ కు కూతురు పుట్టిందంటూ వెల్లడి
- అభినందనలు తెలుపుతూ నెటిజన్ల కామెంట్లు
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మంచు మనోజ్ కు అభినందనలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, మంచు మనోజ్, భూమా మౌనికలకు గతంలో వేర్వేరు పెళ్లిళ్లు అయిన విషయం తెలిసిందే. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న వీళ్లు.. గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మౌనిక ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యామిలీ ఫ్యాన్స్ తో మనోజ్ పంచుకున్నారు. సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.