హత్య కేసులో.. బ్రిటన్‌లో నలుగురు భారత సంతతి వ్యక్తులకు జీవితకాల జైలు శిక్ష
- గతేడాది ఇంగ్లండ్‌లో భారత సంతతి డెలివరీ ఏజెంట్ దారుణ హత్య
- వివిధ రకాల బ్యాట్లు, పలుగు, పారలతో బాధితుడిపై దాడి చేసిన భారత సంతతి నిందితులు
- నిందితులందరికీ కలిపి మొత్తం 122 ఏళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం
అర్మాన్‌దీప్‌ను హత్య చేసిన నిందితులందరికీ కనీసం 28 ఏళ్ల చొప్పున, అర్మాన్‌దీప్ సమాచారం ఇచ్చిన వ్యక్తికి 10 ఏళ్ల చొప్పున మొత్తం అందరికీ కలిపి 122 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో నిందితులు హత్య చేశారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బహిరంగంగా బాధితుడిపై దాడి చేసి రక్తపుమడుగులో అతడిని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు.
నిందితులందరికీ కఠిన శిక్షలు పడినందుకు స్థానిక పోలీసు ఉన్నతాధికారి హర్షం వ్యక్తం చేశారు. నిందితులు సుదీర్ఘకాలం జైలు గోడలకే పరిమితమవుతారని, సామన్యులకు వీరితో ఇకపై ఎటువంటి ప్రమాదం ఉండదని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. దారుణ నేరాలకు పాల్పడేవారు చట్టం నుంచి తప్పించుకోలేరని, ఇందుకు తాజా శిక్షలే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.