మాజీ వ్యాపార భాగస్వామిపై ధోనీ క్రిమినల్ కేసు.. అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ వ్యాపార భాగస్వామిపై ధోనీ క్రిమినల్ కేసు.. అరెస్ట్

Dhoni ex business partner Mihir Diwakar arrested
  • క్రికెట్ అకాడమీ స్థాపనలో ధోనీ పేరు దుర్వినియోగం
  • ధోనీతో తనకున్న అనుబంధాన్ని పెట్టుబడిగా మార్చుకునేందుకు యత్నించిన మిహిర్ దివాకర్ 
  • ధోనీ ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
టీమిండియా మాజీ స్కిప్పర్ మహేంద్రసింగ్ ధోనీ మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిహిర్ మోసానికి పాల్పడ్డాడన్న ధోనీ ఫిర్యాదు మేరకు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారమే మిహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 

జైపూర్‌లో క్రికెడ్ అకాడమీ స్థాపనలో మిహిర్ అనధికారికంగా ధోనీ పేరును వాడుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ ఫిర్యాదు మేరకు మిహిర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. క్రికెట్ అకాడమీలు ప్రారంభించేందుకు ధోనీతో తనకున్న అనుబంధాన్ని మిహిర్ తప్పుగా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలున్నాయి. తన పేరును ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ తన ఆథరైజేషన్‌ను ధోనీ ఉపసంహరించుకున్న తర్వాత కూడా మిహిర్ ఆయన పేరును దుర్వినియోగం చేయడంతో ధోనీ ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాడు.
Advertisement
MS Dhoni
Mihir Diwakar
Criminal Case
Cricket Academy

More Telugu News