Lovers: మంత్రాలయంలో రైలుకిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

ఆదోనిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంత్రాలయానికి చెందిన నందిని (20) కర్నూలులో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. ఉగాది పండుగ కోసం రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చింది. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్న వెంకటేశులు (22) ఇంటర్మీడియట్ వరకు చదువుకొని వ్యవసాయం చేస్తున్నాడు.  నందిని, చిన్నవెంకటేశులు ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఆ పరిచయం వారితో పాటే పెరిగి ప్రేమగా మారింది. 

పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరన్న భయమో, మరోటో కానీ ఆదివారం అర్ధరాత్రి దాటి తర్వాత నందిని, చిన్నవెంకటేశులు ఇద్దరూ మంత్రాలయం-మటుమర్రి రైల్వే స్టేషన్ల మధ్య టీబీ వంతెన వద్ద రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యతో ఇరువురి గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.
Lovers
Love Couple
Kurnool District
Mantralayam
Andhra Pradesh

More Telugu News