జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ఇవ్వడంపై చిరంజీవి స్పందన
జనసేన పార్టీకి ఏకమొత్తంలో రూ.5 కోట్ల భారీ విరాళం ఇవ్వడం పట్ల మెగాస్టార్ చిరంజీవిపై అభిమాన వర్గాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై చిరంజీవి స్పందించారు. తమ్ముడి పట్ల తన ప్రేమను వ్యక్తపరిచారు.
"అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తాం అంటారు. కానీ, అధికారంలోకి లేకపోయినా తన సంపాదనను రైతు కూలీల కోసం పవన్ కల్యాణ్ వినియోగించడం నాకు సంతోషాన్ని కలిగించింది. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కల్యాణ్ లక్ష్యానికి కొంతైనా సాయపడుతుందని నేను సైతం జనసేనకు విరాళం అందించాను" అని చిరంజీవి సోషల్ మీడియాలో వివరించారు.