మోదీ గ్యారెంటీ అంటే ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించడమే...: మమతా బెనర్జీ కౌంటర్
- జూన్ 4 తర్వాత అవినీతి నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ చెప్పారన్న దీదీ
- అలా చెప్పడమంటే ప్రతిపక్ష నేతలను జైల్లో పెడతామనే అర్థమని వ్యాఖ్య
- ఇదే మోదీ గ్యారెంటీ అని మమతా బెనర్జీ ఆగ్రహం
ప్రధాని మోదీ ప్రచారంలో భాగంగా బెంగాల్‌కు వస్తున్నారని... ఇందులో తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. కానీ లోక్ సభ ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రధానిస్థాయి వ్యక్తి ఇలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత బీజేపీ నేతలను జైల్లో పెడతానని నేను చెబితే ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఇది సరైనదేనా? అని ఆమె మండిపడ్డారు.