వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్

MLC Mohammed Iqbal resigns for YSRCP
  • వైసీపీ నుంచి పెరుగుతున్న వలసలు
  • తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు, శాసనమండలి చైర్మన్ కు పంపిన ఇక్బాల్
  • పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టీకరణ

మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనుండగా ఏపీ అధికార పక్షం వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు. మహ్మద్ ఇక్బాల్ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పంపించారు. శాసనమండలి చైర్మన్ కు కూడా రాజీనామా లేఖను పంపారు. తన రాజీనామాకు వ్యక్తిగత అంశాలే కారణమని మహ్మద్ ఇక్బాల్ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Mohammed Iqbal
MLC
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News