కాంగ్రెస్ 14 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
- తెలంగాణలో తాము 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటామని మహేశ్వర్ రెడ్డి ధీమా
- రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
- పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం పంటనష్టం అందించడం లేదని విమర్శ
- రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపాటు
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం పంటనష్టం అందించడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలలో ఒక్కదానిని కూడా అమలు చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని విమర్శించారు.