బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎంబీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్
- తాడూరి శ్రీనివాస్‌తో పాటు బీజేపీలో చేరిన పలువురు బీఆర్ఎస్ ఉప్పల్ నాయకులు
- వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. వంద రోజుల్లో హామీలు పూర్తి చేస్తామని చెప్పారని... కానీ ఆ పార్టీకి ఇంకా గడువు పూర్తయినట్లుగా లేదని ఎద్దేవా చేశారు.
కాగా, తాడూరి శ్రీనివాస్ ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపించారు. పార్టీలో తనకు గుర్తింపు లేనందునే పార్టీని వీడుతున్నట్లు అందులో పేర్కొన్నారు.