బీజేపీ నేతల 'ప్రధాని' వ్యాఖ్యలపై కేటీఆర్ చురకలు..!
- బీజేపీ నేతలు భారత తొలి ప్రధాని విషయమై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత సెటైరికల్ ట్వీట్
- భారత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అంటూ నోరు జారిన నటి కంగనా రనౌత్
- ఇదే విషయమై 'ఎక్స్' వేదికగా కేటీఆర్ సెటైర్లు
"ఉత్తరాదికి చెందిన ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన తొలి ప్రధానమంత్రి అని అంటారు. దక్షిణాదికి చెందిన మరో బీజేపీ నేత మహాత్మాగాంధీ మన ప్రధాని అని చెబుతారు. అసలు వీళ్లంతా ఎక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారో?" అని కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.