మూడున్నర కోట్లు పట్టుకున్నా కోమటిరెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: రఘునందన్ రావు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లను నిందితులుగా చేర్చాలన్న రఘునందన్
- ఈ కేసుపై 2014 నుంచే విచారణ చేపట్టాలని డిమాండ్
- స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ. 3.5 కోట్లు ఎక్కడకు పోయాయని ప్రశ్న
మునుగోడు ఉపఎన్నికల సమయంలో రూ. 3.5 కోట్లను పట్టుకున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల కొనుగోలు కేసులో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ. 30 కోట్లు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి గతంలో తాను ఫిర్యాదు చేశానని... ఆ ఫిర్యాదుపై పోలీసులు ఉన్నతాధికారులను ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు.