Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోహిత్ శ‌ర్మ‌ను భ‌య‌పెట్టిన అభిమాని.. ఇదిగో వీడియో!

Fan who Enter into the Wankhede Stadium Ground and reach to Rohit Sharma during MI vs RR IPL 2024 Match
Advertisement
  • సెక్యూరిటీ సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి మైదానంలోకి ప్ర‌వేశించిన అభిమాని
  • రోహిత్ శ‌ర్మ‌ను కౌగిలించుకున్న ఫ్యాన్‌.. ఊహించ‌ని ప‌రిణామంతో ఉలిక్కిప‌డ్డ హిట్‌మ్యాన్‌
  • నిన్న‌టి వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ్యాచ్‌లో ఘ‌ట‌న‌
Advertisement
గ‌త‌ నెల 25వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక‌గా ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి మైదానంలోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. విరాట్ కోహ్లీ వ‌ద్దకు ప‌రిగెత్తుకువ‌చ్చిన ఆ అభిమాని.. కోహ్లీ కాళ్లు మొక్కడంతో పాటు కౌగిలించుకున్నాడు. ఆ త‌ర్వాత సెక్యూరిటీ సిబ్బంది అత‌డిని మైదానం నుంచి బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. అచ్చం ఇలాంటి సంఘ‌ట‌న‌ సోమ‌వారం నాటి ముంబై ఇండియ‌న్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) మ్యాచ్‌లోనూ చోటు చేసుకుంది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ముంబై ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 

ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి మైదానంలోకి ప్ర‌వేశించాడు. అనంత‌రం నేరుగా రోహిత్ శ‌ర్మ వ‌ద్ద‌కు ప‌రిగెత్తుకువ‌చ్చాడు. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డ హిట్‌మ్యాన్.. ఆ అభిమానిని కౌగిలించుకుని మైదానం నుంచి బ‌య‌టికి వెళ్లాల‌ని కోరాడు. ఇక రోహిత్‌ను కౌగిలించుకున్న ఆ వ్య‌క్తి త‌ర్వాత ప‌క్క‌నే కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిష‌న్‌తో క‌రచాల‌నం చేసి గ్రౌండ్ నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశాడు. ఇది గ‌మ‌నించిన సెక్యూరిటీ సిబ్బంది వెంట‌నే అత‌డిని అదుపులోకి తీసుకుని మైదానం నుంచి బ‌య‌ట‌కు లాక్కెళ్లారు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  
Advertisement
Advertisement
IPL 2024
Rohit Sharma
Fan
Wankhede Stadium
Cricket
Sports News

More Telugu News