విస్తారాలో మరింత ముదిరిన ‘పైలెట్ల సంక్షోభం’.. పదుల సంఖ్యలో సర్వీసుల రద్దు
- మంగళవారం దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో విమాన సర్వీసుల రద్దు
- సోమవారం కూడా ఇదే పరిస్థితి.. అసౌకర్యానికి గురవుతున్న ప్రయాణికులు
- జీతాల విధానాన్ని సవరించడాన్ని వ్యతిరేకిస్తున్న పైలెట్లు
- అనారోగ్యం సాకులతో డ్యూటీకి డుమ్మా కొడుతున్న వైనం
సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు వేర్వేరు కారణాలతో గత కొన్ని రోజులుగా గణనీయ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేశామని ప్రకటనలో విస్తారా పేర్కొంది. పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. విమాన సర్వీసులపై సత్వర స్పందన లేకపోవడం, ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి నిరీక్షణపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఎయిరిండియాలో విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరిస్తూ పైలెట్లకు విస్తారా ఎయిర్‌లైన్స్ మెయిల్స్ పంపించింది. ఈ నోటీసుపై సంతకం చేయాలని కోరింది. సంతకం చేయని పైలెట్లు విలీనం పరిధిలో ఉండబోరని హెచ్చరించింది.