నేడు జనసేనలోకి మండలి బుద్ధప్రసాద్.. అవనిగడ్డ నుంచి బరిలోకి?
- నేడు పిఠాపురంలో పవన్ సమక్షంలో చేరిక
- అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దింపే యోచన
- బాలశౌరికి మచిలీపట్టణం టికెట్ కేటాయింపు వెనక బుద్ధప్రసాద్
1999, 2004, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడం కూడా ఇందుకు మరో కారణం. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా అవనిగడ్డను తన ఖాతాలో వేసుకోవాలని జనసేన భావిస్తోంది. ఇక, మచిలీపట్టణం లోక్‌సభ స్థానానికి కూటమి నుంచి బరిలోకి దిగిన వల్లభనేని బాలశౌరికి జనసేన టికెట్ కేటాయించడం వెనక మండలి బుద్ధప్రసాద్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.