లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘటన
- రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్, సివిల్ క్విక్ రెస్పాన్స్ టీం, పోలీసులు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ క్విక్ రెస్పాన్స్ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కారులోంచి మృతదేహాలను వెలికి తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు.