సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీనియర్ నేత వీహెచ్
- వీహెచ్‌ను సీఎం వద్దకు తీసుకెళ్లిన ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
- పార్లమెంట్ టికెట్ ఆశించిన వి. హనుమంతరావు
- టికెట్ తనకు వచ్చే అవకాశం లేకపోవడంతో అలకబూనిన వీహెచ్
- గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత
- వీహెచ్‌కు అన్ని విధాల అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ
ఈ నేపథ్యంలోనే ఇటీవల మీడియా సమావేశంలోనూ ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఇలా పార్టీకి దూరంగా ఉంటున్న వీహెచ్‌ను మహేశ్ కుమార్ గౌడ్ బుజ్జగించి సీఎం వద్దకు తీసుకెళ్లారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి.. వీహెచ్‌కు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.